Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి
కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు.
పెద్దాపురం: కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో ఈ ఘటన జరిగింది. ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి వెళ్లి మరణించారు. ఒకరి తర్వాత ఒకరు దిగి ఊపిరాడక మొత్తం ఏడుగురూ చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిశీలించారు.
మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులు కాగా.. మిగిలిన ఇద్దరిది పెద్దాపురం మండలం పులిమేరు గ్రామం. పాడేరుకు చెందిన మృతులను కుర్రా రామారావు(45), వెచ్చంగి కృష్ణ (35), వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్, కురతాడు బంజిబాబుగా గుర్తించారు. పులిమేరుకు చెందిన మృతుల్లో కట్టమూరి జగదీశ్, ప్రసాద్ ఉన్నట్లు తేల్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది: మంత్రి కేటీఆర్
-
Movies News
Samantha: ‘సామ్.. మళ్లీ ప్రేమలో పడొచ్చుగా..!’ నెటిజన్ ట్వీట్‌కు సామ్ సమాధానం ఏమిటంటే..?
-
Crime News
Crime News: పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసులో ముగ్గురి అరెస్టు: ఎస్పీ
-
India News
Uddhav Thackeray: ఆయన్ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్..!
-
Sports News
T20 Cricket: టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా..
-
General News
MLC kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. 3 వారాలకు వాయిదా