Tadipatri CI: తాడిపత్రి సీఐ ఆత్మహత్య.. ఇంట్లోనే ఉరివేసుకుని..

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు (52) ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 03 Jul 2023 08:29 IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు (52) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత 9 నెలలుగా ఆనందరావు తాడిపత్రి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సీపీఐ కాలనీలోని అద్దె ఇంట్లో ఆయన కుటుంబం నివాసముంటోంది. గత కొన్ని రోజులుగా భార్య అనురాధతో సీఐకు గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు నిద్రపోయిన తర్వాత ఇంట్లోనే సీఐ ఉరివేసుకున్నారు.

గత మూడునెలలుగా పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. సీఐ ఆనందరావు గత ఏడాది సెప్టెంబర్‌లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి. సీఐకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆనందరావు ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గలకారణాలపై విచారిస్తున్నారు. సీఐ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని