Loan Apps case: రుణ యాప్‌ల కేసులో దర్యాప్తు ముమ్మరం.. నగదు మళ్లించిన బ్యాంకు మేనేజర్‌ అరెస్టు

రుణ యాప్‌ల కేసుల్లో నిలిపివేసిన బ్యాంకు ఖాతాల్లోని నగదును మళ్లించినందుకు బ్యాంకు మేనేజర్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు

Updated : 31 Aug 2021 05:15 IST

హైదరాబాద్‌: రుణ యాప్‌ల కేసులో నిలిపివేసిన బ్యాంకు ఖాతాల్లోని నగదును మళ్లించినందుకు బ్యాంకు మేనేజర్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా అలీపూర్‌ ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌ రాకేశ్‌ కుమార్‌ దాస్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిలిపివేసిన ఖాతాల్లో నుంచి నగదు బదిలీ అయిందని జూన్‌లో గచ్చిబౌలి ఐసీఐసీఐ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోల్‌కతాలోని ఆలీపూర్‌ బ్రాంచ్‌ నుంచి రూ.1.18 కోట్ల నగదు బదిలీ అయినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు మేనేజర్‌ రాకేష్‌ కుమార్‌ దాస్‌ను ప్రశ్నించగా.. సైబర్‌ క్రైం ఎస్సై బ్రాంచ్‌కు వచ్చి నగదు డీప్రీజ్‌ చేయమని చెప్పాడని అందుకే నగదు బదిలీ చేసినట్లు తెలిపాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా.. కమిషన్‌ కోసం ఖాతాల్లో నుంచి నగదు బదిలీ చేసినట్లు తేలింది. ఎస్సైలా వెళ్లిన నల్లమోతు అనిల్‌కుమార్‌ను, అతనికి సహకరించిన ఆనంద్‌ జున్నును జూన్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని