HRC: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆయన సోదరుడిపై హెచ్చార్సీలో ఫిర్యాదు

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆయన సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన విశ్వనాథరావు, పుష్పలత దంపతులు బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించారు.

Updated : 29 Jul 2021 06:54 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆయన సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన విశ్వనాథరావు, పుష్పలత దంపతులు బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించారు. 2018 ఎన్నికల సమయంలో ఓ కేసులో శ్రీనివాస్‌గౌడ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామని అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నారని కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి వేళలో ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓ పైవేటు సంస్థలో పనిచేస్తున్న తమ ఇద్దరినీ ఉద్యోగాల్లోంచి తీయించేశారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా వేధింపులు ఆగకపోతే మంత్రి, ఆయన సోదరుడి పేర్లతో లేఖ రాసి ఠాణా ముందు ఆత్మహత్య చేసుకుంటామని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని