Crime News: నడికుడిలో కలర్‌ జిరాక్స్‌... తెలుగు రాష్ట్రాల్లో నకిలీనోట్ల చలామణి

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.  నిందితుల నుంచి రూ.45లక్షల విలువైన నకిలీనోట్లు..

Published : 26 Dec 2021 17:07 IST

గుంటూరు: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.  నిందితుల నుంచి రూ.45లక్షల విలువైన నకిలీనోట్లు, రెండు కార్లు, కంప్యూటర్‌, ప్రింటర్లు, స్కానర్‌, పత్రాలు, సామగ్రి  స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులంతా ఓ ముఠాగా ఏర్పడి నడికుడిలో కలర్‌ జిరాక్స్‌ ద్వారా రూ.200, రూ.500 నోట్లు ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేశారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.2లక్షల నకిలీనోట్లు చలామమణి చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులంతా రెంటచింతల, దుర్గి, దాచేపల్లి, అచ్చంపేట వాసులుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని