
Crime News: గచ్చిబౌలిలో యువతిపై కత్తితో దాడి
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి వట్టినాగులపల్లిలో యువతిపై ఓ యువకుడు కత్తితో హత్యకు యత్నించాడు. యువతి అరుపులతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్థానికులు యువకుడిని పట్టుకొని చితకబాది గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. వట్టినాగులపల్లికి చెందిన ప్రేమ్‌సింగ్ కేపీహెచ్‌బీలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ యువకుడు నిన్న అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చి దాడి చేసినట్లు యువతి తల్లిదండ్రులు తెలిపారు. దాడిలో యువతికి స్వల్పగాయాలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాగిన మైకంలోనే యువకుడు హత్యాయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.
స్థానికుల దాడిలో గాయపడిన ప్రేమ్‌సింగ్‌ను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. యువకుడి దాడిలో యువతి మెడ, చేయి, కాలుపై మూడు చోట్ల గాయాలయ్యాయని గచ్చిబౌలి ఎస్‌ఐ నవీన్ రెడ్డి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.