Updated : 29 Apr 2021 14:00 IST

విజయవాడలో దారుణం

భార్య, కన్నబిడ్డలను కడతేర్చాడు..

విజయవాడ: విజయవాడ వాంబే కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు బిడ్డలను కిరాతకంగా పొట్టన పెట్టుకున్న ఓ భర్త.. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. వాంబే కాలనీలోని డీ బ్లాక్‌లో మోహన్‌, నీలవేణి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భారీగా అప్పులు చేయడంతో పాటు తరచూ భార్యతో  మోహన్‌ గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే భార్యతో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేసి పరారయ్యాడు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురినీ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటినుంచి పారిపోయిన మోహన్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. రైలు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాణ భయంతో తప్పుకొనే యత్నంలో తీవ్ర గాయాలపాలపాలయ్యాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని చికిత్స కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని