logo

కార్మికుల పోరాట ఫలితమే 8 గంటల పని దినాలు

8 గంటల పని కోసం కార్మికులు పోరాడిన ఫలితంగా మే 1న మేడే పండుగను నిర్వహించుకుంటున్నామని సీఐటీయూ ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబు అన్నారు. మేడే ముగింపు వారోత్సవాలను పురస్కరించుకొని ఆ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీగా చేపట్టారు.

Updated : 07 May 2024 15:49 IST

ఎదులాపురం: 8 గంటల పని కోసం కార్మికులు పోరాడిన ఫలితంగా మే 1న మేడే పండుగను నిర్వహించుకుంటున్నామని సీఐటీయూ ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబు అన్నారు. మేడే ముగింపు వారోత్సవాలను పురస్కరించుకొని ఆ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీగా చేపట్టారు. అనంతరం మేడే వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. 8 గంటల పనిదినం కోసం కార్మికవర్గం రక్తాన్ని చిందించిందని, ఆ రక్తపు మడుగులోనే ఎర్ర జెండా పుట్టిందని అన్నారు. కార్మిక చట్టాల పునరుద్ధరణకై, హక్కుల సాధన కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం, ప్రభుత్వ సంస్థలను కాపాడుకుందాం అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని