logo

సైన్సు లేని జ్ఞానం అసంపూర్ణం

సమాజంలో రుగ్మతలు రూపు మాపేందుకు సైన్స్ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

Updated : 07 May 2024 15:57 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: సమాజంలో రుగ్మతలు రూపు మాపేందుకు సైన్స్ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక డైట్ కళాశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సైన్సు సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యాక్సిన్ ద్వారా పిల్లలను వ్యాధుల నుంచి వైద్యులు కాపాడుతతున్నారని తెలిపారు. కొందరు సైన్సుని పక్కనపెట్టి మూఢనమ్మకాలను నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి  ప్రణీత, సెక్టోరియల్ అధికారి నారాయణ, జిల్లా సైన్స్ అధికారి రఘు రమణ, జనవిజ్ఞాన వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బెదోడ్కర్, సంతోష్ కుమార్, నూతుల రవీందర్ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని