logo

లక్ష గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Published : 17 May 2024 13:43 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఆయా విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జయ, సునయన, కీర్తి, స్వరూప, సరిత, సంతోషిణి, జ్యోతి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని