logo

గోరుముద్దలో గుడ్లెక్కడ మామయ్యా?

మామయ్యా.. గోరుముద్ద ప్రచారం కోసమా? మాకు పౌష్టికాహారం కోసమా? అని ప్రభుత్వ పాఠశాలల బాలలు ప్రశ్నిస్తున్నారు. జగనన్న గోరుముద్ద అంటూ గొప్పలు చెప్పుకునే వైకాపా ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు కోడిగుడ్లను దూరం చేసింది.

Updated : 11 Apr 2024 06:23 IST

బిల్లు ఇవ్వక నిలిచిన సరఫరా
అనకాపల్లి/ పాడేరు, న్యూస్‌టుడే

విద్యార్థులకు భోజనం అందిస్తున్న ఉపాధ్యాయులు (పాత చిత్రం)

మామయ్యా.. గోరుముద్ద ప్రచారం కోసమా? మాకు పౌష్టికాహారం కోసమా? అని ప్రభుత్వ పాఠశాలల బాలలు ప్రశ్నిస్తున్నారు. జగనన్న గోరుముద్ద అంటూ గొప్పలు చెప్పుకునే వైకాపా ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు కోడిగుడ్లను దూరం చేసింది. చెల్లింపులు లేక ఏప్రిల్‌ నుంచి జిల్లాÅలో పాఠశాలలకు కోడిగుడ్లు, చిక్కీల సరఫరా నిలిచిపోయింది. ప్రచారం మీద ఉన్న ఆసక్తి విద్యార్థుల భోజనంపై లేకపోవడం అన్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

జిల్లాలో నెలకు సుమారుగా 19 లక్షల కోడిగుడ్లను ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో వినియోగిస్తున్నారు. వీటికి గత ఆరు నెలలుగా చెల్లింపులు లేవు. జిల్లాలోనే సుమారుగా రూ. 6.50 కోట్ల బకాయిలు ఉంటాయని అంచనా. పాఠశాలల్లో విద్యార్థులకు కోడిగుడ్లను పెట్టక పోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ప్రభుత్వం సరఫరా చేయకపోతే మేమేం చేయాలని చేతులెత్తేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా మరికొన్ని పాఠశాలల్లో సీఎం జగన్‌ ఫొటో ఉన్న కవర్‌ను తొలగించి విద్యార్థులకు చిక్కీలను అందిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే  కోడిగుడ్ల సరఫరాకు చర్యలు తీసుకోవాలని   తల్లిదండ్రులు, కమిటీల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని