logo

గిరి విద్యార్థుల జయకేతనం

పది ఫలితాల్లో గిరి విద్యార్థులు రాణించారు. ఫలితాలపై పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Published : 23 Apr 2024 02:39 IST

ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులతో ఐటీడీఏ పీవో, ఉపాధ్యాయులు

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: పది ఫలితాల్లో గిరి విద్యార్థులు రాణించారు. ఫలితాలపై పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను అభినందించారు. గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఈసారి వినూత్నంగా సూపర్‌ ఫిఫ్టీ విద్యార్థుల పేరిట వివిధ పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులకు పాడేరు మండలం మోదాపుట్టు గిరిజన సంక్షేమ పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వీరిలో కిలో ధారమణి(585/600), కిలో తిరుపతి(566/600), తాంగుల హరిలాల్‌ ప్రసాద్‌(562/600) తదితరులు మంచి మార్కులు సాధించినట్లు గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు తెలిపారు.

ముంచంగిపుట్టు, అనంతగిరి గ్రామీణం, పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: : కిలగాడ కస్తూర్బా విద్యార్థిని అరిసెల శిరిషా 530 మార్కులు సాధించినట్లు ఎంఈవో కృష్ణమూర్తి తెలిపారు. గుమ్మకోట గురుకుల పాఠశాల విద్యార్థి జి.భార్గవ్‌కు 563 మార్కులు వచ్చాయి. కొత్తూరు కేజీబీవీ విద్యార్థిని సంజుల 540 మార్కులు కైవసం చేసుకున్నారు. పెదబయలు గురుకుల పాఠశాల విద్యార్థి గెమ్మెలి విజయ్‌కుమార్‌ 559 మార్కులు సాధించారు.

సీలేరు, కొయ్యూరు: సీలేరు ఏపీ జెన్‌కో డీఏవీ పాఠశాల విద్యార్థి 550,  షేక్‌ జుబేదా 545, తేజశ్రీ 544 మార్కులు సాధించారు. కొయ్యూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి 561 మార్కులు సాధించాడు.

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయ శారదానికేతన్‌ పాఠశాలకు చెందిన కొర్ర కౌసిక్‌  589 మార్కులు సాధించాడు.

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగి గురుకుల పాఠశాలలో చదువుతున్న దూసరపాముకు చెందిన పెదపాటి యమల  553 మార్కులు సాధించింది.  

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం మండలంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో మల్లేశ్వరరావు తెలిపారు. 764 మంది పరీక్షలకు హాజరు కాగా, 720మంది పాసయ్యారు. స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలుర ఉన్నత పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణతను సాధించిందని ప్రిన్సిపల్‌ ఎస్‌కే అహ్మద్‌ ఆలీషా వెల్లడించారు.

మోతుగూడెం, న్యూస్‌టుడే: మోతుగూడెం జెన్కో డీఏవీ ఉన్నత పాఠశాల నుంచి 24 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో అందరూ ఉత్తీర్ణులయ్యారు. వీరిలో దొడ్డి గణేశ్‌ 571, విఘ్నజితరాజు 565, డి.తన్విక 561 మార్కులు సాధించారు. మోతుగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 16 మంది, డొంకరాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో 12 మంది, బాలికల ఆశ్రమ పాఠశాలలో 26 మంది, మంగంపాడు బాలుర ఉన్నత పాఠశాలలో 10 మంది  ఉత్తీర్ణులయ్యారు. 

చింతూరు, కూనవరం వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: కూనవరం మండలంలో 93.5 శాతం ఫలితాలు నమోదయ్యాయి. వరరామచంద్రాపురం మండలంలోని నాలుగు పాఠశాలల నుంచి 295 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా, 259 మంది ఉత్తీర్ణులయ్యారని ఎంఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. చింతూరు జిల్లా పరిషత్తు పాఠశాలకు చెందిన విద్యార్థి వసుందర 570, ఏజీహెచ్‌ఎస్‌ నర్సింహపురం  విద్యార్థిని నవ్య 560, కూనవరం ఏపీఆర్‌ పాఠశాలకు చెందిన విద్యార్ధిని హర్షిత 559 మార్కులు సాధించారు. వీరికి నగదు బహుమతులు అందజేస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య ప్రకటించారు.

ఎటపాక, అడ్డతీగల: ఎటపాక మండలంలో మొత్తం పది పాఠశాలలకు చెందిన 286 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా వారిలో 272 మంది ఉత్తీర్ణత సాధించారు.

అడ్డతీగల మండలంలో పదో తరగతి పరీక్షలకు 387 మంది విద్యార్థులు హాజరుకాగా 356మంది ఉత్తీర్ణత సాధించారు.  

దేవీపట్నం: ఇందుకూరుపేట ఉన్నత పాఠశాలలో 58 మంది విద్యార్థులకు గాను 58 మంది ఉత్తీర్ణత సాధించారు. గ్రామానికి చెందిన గొర్రెల లోకేష్‌ 571 మార్కులు సాధించగా ఇదే గ్రామానికి చెందిన అయినాల సాయిశ్రీ వల్లి 561 మార్కులు సాధించారు.  

మారేడుమిల్లి, గంగవరం, న్యూస్‌టుడే:  మారుడుమిల్లి మండలంలో తొమ్మిది పాఠశాలల నుంచి 308 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 301 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గంగవరం మండలంలోమొత్తం 251 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 243 మంది ఉత్తీర్ణులయ్యారని ఎంఈఓ వై. మల్లేశ్వరరావు తెలిపారు. వేములోవ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని బి.కావ్య 555 మార్కులు సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని