logo

బీమా సొమ్ము చెల్లించాలని తీర్పు

బీమా సొమ్ము చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ తీర్పు చెప్పింది. కమిషన్‌ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం..

Published : 28 Mar 2024 05:43 IST

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: బీమా సొమ్ము చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ తీర్పు చెప్పింది. కమిషన్‌ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. గుడివాడకు చెందిన పొట్లూరి బాపయ్య చౌదరి, ఆయన భార్య శ్రీదేవిలు స్టార్‌ హెల్త్‌ ఎల్లాయిడ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ద్వారా కరోనా కవచ్‌ పాలసీలు తీసుకున్నారు. అనుకోకుండా ఇద్దరికీ కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇందుకు చెరో రూ.2 లక్షలు చొప్పున ఖర్చు అవడంతో  ఆ మొత్త ఇవ్వాలని బీమా సంస్థకు దరఖాస్తు చేసుకున్నారు. వారు వివిధ కారణాలతో తిరస్కరించడంతో వినియోగదారుల కమిషన్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం విచారణ నిర్వహించగా ఫిర్యాదుదారులు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షలు, పాలసీ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికీ రూ.22,500 చొప్పున ఇద్దరికీ రూ.45 వేలు కలిసి చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు  సీహెచ్‌ కిషోర్‌కుమార్‌, సభ్యులు శ్రీలక్ష్మీరాయల, నందిపాటి పద్మారెడ్డిలు తీర్పు చెప్పారు. దీంతోపాటు మానసిక వేదన కలిగించినందుకు ఒక్కొక్కరికీ రూ.25వేల చొప్పున రూ.50వేలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఫిర్యాదుదారులకు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని