logo

ఈవీఎం-వీవీ ప్యాడ్ల ఓటింగ్‌ సజావుగా సాగాలి

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం-వీవీ ప్యాడ్ల) ద్వారా జరిగే ఓటింగ్‌ ప్రక్రియ సక్రమంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకురాలు మంజురాజ్వాల్‌ సూచించారు.

Published : 06 May 2024 03:06 IST

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం-వీవీ ప్యాడ్ల) ద్వారా జరిగే ఓటింగ్‌ ప్రక్రియ సక్రమంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకురాలు మంజురాజ్వాల్‌ సూచించారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ క్రీడా ప్రాంగణంలో ఆదివారం జరిగిన పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం-వీవీ ప్యాడ్‌ల పనితీరు ప్రత్యేక్ష పరిశీలన కార్యక్రమంలో ఆమె పాల్గొని రాజకీయపక్షాల ప్రతినిధుల సందేహాలను ఎన్నికల అధికారుల ద్వారా ఆమె నివృత్తి చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం- వీవీ ప్యాడ్‌ల కమిషనింగ్‌ ప్రక్రియను పరిశీలించామని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆయా యంత్రాలు పనిచేసే విధానంతో పాటు ఓటర్లు తమ ఓట్లను సద్వినియోగం చేసుకునే సమయంలో వరుస క్రమంలో జరిగే పరిణామ క్రమాన్ని వివరించారు. అనంతరం ఆమె స్ట్రాంగ్‌ రూంలు పరిశీలించి, అధికారుల నుంచి పలు వివరాలు సేకరించి సూచనలు చేశారు. సహాయ రిటర్నింగ్‌ అధికారి జీవీజీఎస్‌వీ ప్రసాద్‌, ఇతర ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆమె వెంట ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని