logo

గాయపర్చిన ఘటనలో కేసు నమోదు

పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్‌ఐ రాజు గురువారం తెలిపారు.

Published : 17 May 2024 04:24 IST

పెదపారుపూడి(పామర్రు గ్రామీణం), న్యూస్‌టుడే: పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్‌ఐ రాజు గురువారం తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రత్తిపాటి రాజశేఖర్‌కు అదే గ్రామానికి చెందిన గంటా వినోద్‌కి వారం రోజుల కిందట గొడవ జరిగింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇదే విషయమై వినోద్‌కి కుమారుడు వరసయ్యే గంటా కోటేశ్వరరావుకు, ప్రత్తిపాటి రాజశేఖర్‌ మధ్య మాటా మాటా పెరిగి వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో కోటేశ్వరరావు కోపంతో తన మోటారుబైక్‌ కవర్లో ఉన్న రాడ్డును బయటకు తీశారు. పక్కనే ఉన్న ఇంటేటి శశి, ప్రత్తిపాటి దుర్గా, ప్రత్తిపాటి కోటయ్య కోటేశ్వరరావుని పట్టుకోగా రాజశేఖర్‌ అతని వద్ద గల రాడ్డును తీసుకొని తలపై కొట్టి గాయపర్చాడు. బాధితుడు కోటేశ్వరరావు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని