logo

భక్తితో వాసవీ మాత జయంతి

నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు.

Published : 19 May 2024 03:42 IST

బందరు: కన్యకాపరమేశ్వరి అమ్మవారు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. గీతామందిరంలో లలితామ్మవారికి  పూజలు నిర్వహించారు. 

పెడన, న్యూస్‌టుడే: స్థానిక గూడూరు రోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వారం రోజులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని సంఘ అధ్యక్షుడు  సత్యనారాయణ చెప్పారు.

పెడన: వేడుకల్లో భక్తులు

గుడివాడ గ్రామీణం: కన్యకా పరమేశ్వరి దేవస్థానం, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం, 108 మంది సువాసినీలతో పుష్పార్చన, 102 మంది బాల కన్యకలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 6 వేల మందికి అన్నసమారాధన, రాత్రికి అమ్మవారి నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. జానపద, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. దేవస్థానం అధ్యక్షుడు జవ్వాజి గంగరాజు, ప్రధాన కార్యదర్శి నారాయణ మురళీకృష్ణ, కోశాధికారి టంగుటూరి వెంకట సుబ్బారావు, సభ్యులు, వాసవీ ఇంటర్నేషనల్‌ పరివార్‌ జిల్లా అధ్యక్షుడు కూరాళ్ల శ్యామ్‌ సుందర్, ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు బెజవాడ బాజేశ్వరరావు, యక్కలి మణిదీప్, కొత్త కిరణ్, తిరువీధుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

బలరామునిపేట: వేెంకటేశ్వరగానామృతంలో సువాసినులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని