logo
Updated : 04/12/2021 05:12 IST

మధ్యతరగతిమహాభారతం 

న్యూస్‌టుడే- పొన్నూరు, పట్నంబజారు(గుంటూరు)

మహాభారతంలో వ్యూహప్రతివ్యూహాలు, యుద్ధ ప్రణాళికలు ఉంటాయి. అలాగే మధ్యతరగతి వ్యక్తి జీవనపోరాటంలోనూ బతుకు ప్రణాళికపై ఎత్తులు, పై ఎత్తులు వేయాల్సిందే.  ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మధ్యతరగతి జీవనగతి గాడి తప్పింది. ఆదాయం పెరగకపోవడంతో ఈ లోటును ఎలా పూడ్చుకోవాలనేది ప్రశ్నగా మిగిలింది. ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిన తరుణమిదే.

ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కార్తికమాసం కావడంతో ఎక్కువమంది కాయగూరలతో భోజనం చేస్తున్నారు. ఏ కూరగాయ చేత్తో పట్టుకున్నా రూ.70 రూ.80 ధర పలుకుతుంది. కూరగాయల ధరలు  పెరగడంతో వినియోగదారులు కూరగాయల కొనుగోలు కూడా తగ్గిపోయింది. కరోనా కల్లోలం తర్వాత ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజు వారి ఆహారంలో పండ్లు భాగమైపోయాయి. ద్రాక్ష, యాపిల్‌, కమలా తదితర పండ్ల ధరలు పెరిగిపోవడంతో వాటిని భుజించలేని పరిస్థితి నెలకొంది.  విజయవాడ, గుంటూరుల్లో మాల్స్‌లో ఓ కుటుంబం సినిమా చూస్తే రూ.1000 ఖర్చు చేయాల్సి వస్తోంది.

వంటింటి బడ్జెట్‌ భారమైపోయింది. గ్యాస్‌, వంట నూనెలతో పాటు పాలు, పప్పుల ధరలు పెరిగిపోయాయి. నిత్యావసరాలు నడ్డి విరుస్తున్నాయని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. చాలావరకు తగ్గించుకునే ప్రణాళిక రూపొందించుకుంటున్నామని చెబుతున్నారు.

నిపుణులు ఏం చెబుతున్నారు?

* తక్కువ ఖర్చుతో దొరికే పండ్లలో పోషకవిలువలు తక్కువేమీకాదు.  జామలో యాంటియాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డీ- జనరేటివ్‌, క్యాన్సర్‌ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. పచ్చికాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. యాపిల్‌, రేగు పండ్లలో పోషక విలువలకు ఏమీ తేడాలేదు. ఆకుకూరలు వాడితే ఆరోగ్యం పెరిగి ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు.

* వినోదం దూరం చేసుకోకుండా థియేటర్‌ ఖర్చుకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) తక్కువ చెల్లించి కుటుంబం అంతా కలిసి చూడవచ్చు.

* అత్యవసర సమయాల్లో తప్ప ఊరకనే బండిని బయటకు తీయవద్దు

* కొద్దో గొప్పో చేసే పొదుపును సంప్రదాయ పద్ధతిలో కాకుండా మ్యూచివల్‌ ఫండ్స్‌ వంటి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే రిటర్న్‌ ఇచ్చే పథకాల్లో పెడితే మేలు.

* రెండు, మూడు కుటుంబాలు కలసి హోల్‌సేల్‌గా కొనుక్కోవడం, అవసరమైనప్పుడు ఆఫర్లు వినియోగించుకోవడం ద్వారా కొంత ఖర్చు తగ్గుతుంది.

కూరల బదులు పులుసుల వాడకం పెంచాం. మా ఇద్దరు పిల్లలను ట్యూషన్‌ మాన్పించి  నా భార్య వారికి ఇంటి వద్దనే చదువు చెబుతోంది. ఓటీటీలో నెలకు రూ.750 ఖర్చు పెట్టి ఇంటిల్లిపాది సినిమాలు వీక్షిస్తున్నాం.

- నల్లమోలు నరేంద్ర,

శ్రీనివాసరావుపేట, గుంటూరు

అరటికాయల వ్యాపారం చేస్తున్నా. గతంలో పాలకు రూ.1,500 ఖర్చు అయ్యేది. ప్రస్తుతం సగానికి సగం తగ్గించాం. హోల్‌సేల్‌ మార్కెట్‌లో సరకులు కొనడంతో రూ.300 నుంచి రూ.400 వరకు ధరల్లో తేడా కనిపిస్తోంది.

- జెంబలి గౌరీశంకర్‌, నల్లచెరువు, గుంటూరు

షాపులో పని చేస్తూ నెలకు రూ.10వేలు పొందుతున్నాను. బయట టిఫిన్‌ చేయకుండా ఇంటిలోనే తినేస్తా. ఆదివారాల్లో చికెన్‌, మాంసం తగ్గించాం. వంట నూనె వాడకాన్ని తగ్గించి, సాయంత్రం రసంతో సరిపెడతాం.

-పెరంపూడి అలివేలు, బుడంపాడు

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని