logo

వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్‌

ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఉద్ఘాటించారు.

Published : 25 Apr 2024 05:20 IST

రోడ్‌షోలో అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఉద్ఘాటించారు. బుధవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై ప్రత్యేక వాహనంలో తనయులు పయ్యావుల విక్రమసింహ, విజయసింహతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. సుమారు 35 వేల మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. గడియార స్తంభం సమీపంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా అది మేమే చేశామన్నారు. భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తాను ఈ ప్రాంతానికి ప్రజల తరఫున పెద్ద కూలీగా నిలుస్తానన్నారు. వైకాపా ప్రభుత్వం ఉరవకొండ అభివృద్ధిని విస్మరించిందన్నారు. జీబీసీ రైతులను నట్టేట ముంచారన్నారు. కరవు తాండవిస్తున్నా రైతులకు పంట నష్ట పరిహారం అందించ లేదన్నారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని మరిచారని విమర్శించారు. ఉరవకొండలో 1994 నాటి ఫలితాలే వెలువడనున్నాయని స్పష్టం చేశారు. ఇక్కడ, పైన కూటమి విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఐడీసీ రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ దేవినేని పురుషోత్తం, తెదేపా నాయకులు రేగటి నాగరాజు, యర్రగుంట్ల వెంకటేశ్‌, ప్రతాప్‌నాయుడు, సుంకురత్నమ్మ, శ్రీధర్‌ చౌదరి, నెట్టెం రాంబాబు, బోస్‌, సుధాకర్‌, చిన్న మారయ్య, తిప్పయ్య, మల్లికార్జున, పెద్దకోట్ల రాజేశ్‌, తాజ్‌, కుళ్లాయప్ప, సుంకన్న, బ్రహ్మయ్య, మదమంచి శ్రీనివాసులు, గొర్తి రంగనాయకులు, మోపిడి శ్రీనివాసులు, ప్యారం కేశవ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు