icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలెట్‌.. నరసన్నపేటలో ఓపెన్‌గానే ఓటేశారు!

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. నరసన్నపేట మండల పోలింగ్‌ కేంద్రానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు.

Updated : 04 May 2024 12:17 IST

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. సిబ్బంది రాక ఆలస్యం కావడంతో 9.30 గంటల వరకు కేంద్రాన్ని తెరవలేదు. పోలింగ్‌ కేంద్రం తెరిచాక ఒకేసారి అధిక సంఖ్యలో ఉద్యోగులు లోపలికి ప్రవేశించారు. దీంతో గందరగోళం నెలకొంది. బూత్‌లోని పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి ముగ్గురు, నలుగురు ఒకేసారి వెళ్లడం గమనార్హం. దీంతో రహస్యంగా వేయాల్సిన ఓటును.. ఓపెన్‌గానే వేశారు. మరోవైపు వైకాపా నాయకులు పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. కొందరు ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించారు. ఇంత జరుగుతున్నా అక్కడ పోలీసులు కనిపించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img