logo

ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..

రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్‌ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్‌నాయుడు,

Published : 19 Apr 2024 03:13 IST

పెనుమూరు: అభ్యర్థులు ప్రసాదరావు, థామస్‌ సమక్షంలో పార్టీలో చేరిన వైకాపా నాయకులు

పెనుమూరు: రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్‌ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్‌నాయుడు, రమణయ్యనాయుడు, రామకృష్ణమనాయుడు, డి.జగదీష్‌, సిద్దయ్యనాయుడు, ప్రసాద్‌నాయుడు, గొడుగుమానుపల్లెకు చెందిన సిద్ధయ్య.. తెదేపాలో చేరారు. రాష్ట్ర టీఎన్‌టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి లోకనాథం నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు రుద్రయ్యనాయుడు, మాజీ సర్పంచి కృష్ణమూర్తి, జనసేన గౌరవాధ్యక్షుడు లోకనాథం పాల్గొన్నారు.

బంగారుపాళ్యం: ప్రచారం చేస్తున్న జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు ప్రకాష్‌నాయుడు

చిత్తూరు(జిల్లా పంచాయతీ): ఎమ్మెల్యేగా తన భర్తకు అవకాశమిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అభ్యర్థి జగన్మోహన్‌ సతీమణి ప్రతిమ అన్నారు. 42వ డివిజన్‌లోని బజారువీధి, గాండ్లవీధి, వన్నియర్‌ బ్లాక్‌, గుర్రప్పనాయుడువీధి, డి.ఐ.రోడ్డు, జండామాను వీధిలో నాయకులు, తెలుగు మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు రాణి, నగర అధ్యక్షురాలు వరలక్ష్మి, నాయకులు శివకుమార్‌, జయకుమార్‌, నాగలక్ష్మి, సుధ, గిరిబాబు, పెరుమాళ్‌ పాల్గొన్నారు.

పెనుమూరు: తెదేపా అభ్యర్థి థామస్‌ను గెలిపించాలని కోరుతూ ఆయన తనయుడు రాహుల్‌.. కామచిన్నయ్య పల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తెదేపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నాయకులు తిరివిరెడ్డిపల్లె పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వి.హరిబాబు, మండల అధ్యక్షుడు రుద్రయ్యనాయుడు, రాష్ట్ర టీఎన్‌టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి లోకనాథం నాయుడు, మాజీ సర్పంచి కృష్ణమూర్తి, బీసీసెల్‌ అధ్యక్షుడు అశోక్‌, కలిగిరికొండ మాజీ ఛైర్మన్‌ ఈశ్వరప్రసాదు, తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు అనూరాధ, పాల్గొన్నారు.

చిత్తూరు(జిల్లా పంచాయతీ): పూలు విక్రయించే మహిళతో మాట్లాడుతున్న ప్రతిమ

బంగారుపాళ్యం: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, మురళీమోహన్‌ను గెలిపించాలని తెదేపా శ్రేణులు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం సాగిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు జయప్రకాష్‌నాయుడు, జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు కోకా ప్రకాష్‌నాయుడు, క్లస్టర్‌ అధ్యక్షులు ధరణినాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు రాధిక, మండల తెదేపా కార్యదర్శి జనార్ధన్‌ గౌడ్‌, తెలుగు యువత అధ్యక్షులు రమేష్‌ పాల్గొన్నారు.

ఐరాల: చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు సతీమణి దగ్గుమళ్ల సుజాత తెలిపారు. దివిటివారిపల్లెలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గ్రామ మహిళలు పెద్దఎత్తున ఆమెకు స్వాగతం పలికారు. ఆయా పార్టీల నాయకులు గిరిధర్‌బాబు, తులసీప్రసాద్‌, వేణుగోపాల్‌, ప్రశాంత్‌, సుధాకర్‌, లత, శాంతమ్మ పాల్గొన్నారు.

ఐరాల: దివిటివారిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీ అభ్యర్థి ప్రసాద్‌రావు సతీమణి సుజాత

వెదురుకుప్పం: తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానని అభ్యర్థి థామస్‌ అన్నారు. ఆయన తన భార్య శాంతిరెడ్డితో కలిసి మండలంలోని జక్కదొన పంచాయతీలో బాబు స్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఎగువకనికాపురం గ్రామానికి చెందిన వంద మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు లోకనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహులు, గంటావారిపల్లె సర్పంచి శ్రీనాథరెడ్డి, నాయకులు మోహన్‌మురళి, కిషన్‌చంద్‌, బాబురెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని