logo

‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’

తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ సతీమణి ప్రతిమ అన్నారు.

Published : 27 Apr 2024 02:27 IST

నిండ్ర: ప్రచారం చేస్తున్న తెలుగుమహిళ అధికార ప్రతినిధి నిరోషా

చిత్తూరు(జిల్లా పంచాయతీ): తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ సతీమణి ప్రతిమ అన్నారు. శుక్రవారం నగరంలోని 30, 31, 32 వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేశారు. సైకిల్‌ గుర్తుపై ఓటేసి ఎంపీగా దగ్గుమళ్ల ప్రసాదరావును, ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్‌ను గెలిపించాలని కోరారు. మాజీ కార్పొరేటర్‌ ప్రమీలా ఆనంద్‌, కోఆప్షన్‌ సభ్యుడు కోలా కిరణ్‌, నాయకులు సుధాకర్‌నాయుడు, అన్సర్‌, భాను, చిన్ని, మున్నా, మోహన్‌, కమల్‌, కిరణ్‌, నవీన్‌, సతీష్‌కుమార్‌, మోహన్‌నాయుడు, లత పాల్గొన్నారు.

విజయపురం: తెదేపాలో చేరిన వైకాపా సర్పంచి ఎం.హారతితో భానుప్రకాష్‌

విజయపురం: వైకాపా ప్రభుత్వం పోవాలని-జనం గెలవాలని నియోజకవర్గ ఉమ్మడి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ కోరారు.

గంగమాంబాపురం, కాళికాపురం, ఎం.అగరం, కేవీపురం, చెంగమనాయుడుకండ్రిగ, తెల్లగుంట, ఆమగుంట, గొల్లకండ్రిగ గ్రామాలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో నియోజకవర్గంలో మంత్రి రోజా ఆస్తులు పెరిగాయే తప్ప నియోజకవర్గం అభివృద్ధి చెంద లేదన్నారు. అవినీతి రోజాను ఓడించి ఇంటికి పంపాలంటే సైకిల్‌ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపించాలన్నారు. గంగమాంబాపురం వైకాపా సర్పంచి.. ఎం.హారతి 10మంది కుటుంబ సభ్యులు ఆయన సమక్షంలో తెదేపాలో చేరారు. పార్టీ చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి చినబాబు పాల్గొన్నారు. నిండ్ర: తెదేపా అధికారంలోకి వస్తేనే పేద కుటుంబాలకు సమన్యాయం జరుగుతుందని తెలుగుమహిళ అధికార ప్రతినిధి నిరోషా అన్నారు. కొప్పేడు, కొప్పేడు దళితవాడల్లో ప్రచారం చేశారు. తెలుగుమహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు సంపూర్ణమ్మ, నాయకులు రఘురామ్‌, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

పుత్తూరు: తెదేపా గెలుపు కోసం నగరిలో సమష్టి కృషి చేయాలని రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు పేర్కొన్నారు. పరమేశ్వర మంగళంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి రవినాయుడు, నాయకులు బాలాజీనాయుడు, విజయ్‌చౌదరి, ప్రవీణ్‌ పాల్గొన్నారు. ‌్ర పట్టణ తెదేపా అధ్యక్షుడు, కౌన్సిలర్‌ జీవరత్నం నాయుడు.. భానుప్రకాష్‌ను గెలిపించాలని కోరుతూ 22వ వార్డులో ప్రచారం నిర్వహించారు. క్లస్టర్‌ ఇన్‌చార్జి మాధవులునాయుడు, జి.బాబు, మునిప్రభాకర్‌రెడ్డి, కన్నన్‌, మోహన పాల్గొన్నారు. తవణంపల్లె: తెదేపా నాయకులు.. ఎగువ తవణంపల్లె పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర చౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు దిలీప్‌నాయుడు, భాజపా జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌నాయుడు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి సునీల్‌కుమార్‌, జడ్పీటీసీ మాజీ సభ్యులు కోదండయ్య, గోపి, చిట్టెమ్మ, శరవణ, గాంధీ పాల్గొన్నారు.

వెదురుకుప్పం: ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, థామస్‌ సమక్షంలో పార్టీలో చేరిన బలిజపల్లె ఎస్సీ కాలనీ వాసులు

వెదురు కుప్పం: వైకాపాకు కంచుకోటగా నిలిచిన బలిజపల్లె ఎస్సీ కాలనీలో 15 కుటుంబాలు తెదేపా అభ్యర్థి థామస్‌ సమక్షంలో తెదేపాలో చేరాయి. మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, క్లస్టర్‌ ఇంఛార్జి మోహన్‌మురళి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి సమక్షంలో వైకాపా నేతలు నాగరాజు, మురళి, వెంకటేశ్వర్‌, కిరణ్‌కుమార్‌ నేతృత్వంలో తెదేపా కండువాలు వేసి ఆహ్వానించారు. మండల పార్టీ అధ్యక్షుడు లోకనాథరెడ్డి, సర్పంచి శ్రీనాధరెడ్డి పాల్గొన్నారు. కార్వేటినగరం: ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ థామస్‌.. పద్మసరస్సు ఎస్టీకాలనీ, తూర్పుహరిజనవాడలో బాబు స్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన నియోజకవర్గ బాధ్యుడు పొన్నా యుగంధర్‌, తెదేపా జిల్లా నాయకులు దామోదరం, నిధి, తెదేపా మండల అధ్యక్షుడు చెంగల్రాయులుయాదవ్‌, కార్యదర్శి రాజేంద్రరెడ్డి, నాయకులు రవియాదవ్‌, జగన్నాధం, వెంకటకిషోర్‌, భాజపా మండల అధ్యక్షుడు రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని