logo

రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు

త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి.

Published : 30 Apr 2024 02:51 IST

వర్షమొస్తే ఉరుస్తున్న పైకప్పు
పీవోపీ ఊడిపడుతున్న పట్టని వైనం

తితిదే కల్యాణ మండపంలో మరమ్మతులకు గురై

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెదేపా ప్రభుత్వ హయాంలో 6 ఏళ్ల కిందట వసతుల్లేని టీటీడీ కల్యాణ మండపాన్ని ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. రూ.5.25 కోట్ల నిధులు మంజూరు చేయించారు. అప్పటి వరకు ఆలనాపాలనా లేకపోవడంతో భవనం దెబ్బతింది. దాన్ని రూ. కోటి నిధులతో మరమ్మతులు చేశారు. మరో రూ. కోటితో భవనం పైభాగంలో నూతన కల్యాణ వేదిక నిర్మించారు. మిగిలిన నిధులతో సెంట్రల్‌ ఏసీ కల్యాణ మండపంగా రూపొందించారు. అలాగే కింది మండపాన్ని సుందరీకరించారు. ఆవరణలో పార్కింగ్‌, ఆహ్లాదం కొరకు మొక్కలు పెంచారు. వైకాపా రావడంతో తెదేపా చేసిన పనులపై కసి పెంచుకున్నారు. పూర్తిగా నిర్వహణ విస్మరించారు. రెండేళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచింది. చిన్న, చిన్న మరమ్మతులను విస్మరించడంతో అవి పెద్దవిగా మారి పుకప్పు ఉరస్తుంది. మూడేళ్ల పాటు  విస్మరించారు. దీంతో అవి పెద్దవిగా మారి పైకప్పు కారుతుంది. ఏసీ కోసం చేసిన పీవోపీ షీట్లు తడిసిపోయి కింద పడిపోతున్నాయి. వర్షం కురిస్తే వేదిక వద్ద నీరు చేరుతుంది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.

అధ్వానంగా కల్యాణ వేదిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని