logo

ఆధ్యాత్మిక జీవనంతోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక జీవనంతోనే మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు పేర్కొన్నారు. మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్‌) 86వ జన్మదిన వేడుకల్లో బుధవారం

Published : 20 Jan 2022 05:42 IST


పీధిపతికి ‘విశ్వధార్మిక చూడామణి’ బిరుదు ప్రదానం చేస్తున్న
తితిదే ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితులు తదితరులు

రాయవరం: ఆధ్యాత్మిక జీవనంతోనే మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు పేర్కొన్నారు. మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్‌) 86వ జన్మదిన వేడుకల్లో బుధవారం వేణుగోపాల దీక్షితులు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. ప్రముఖ వస్త్రవ్యాపారి తుమ్మిడి రామ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్‌ రికార్డ్సు నిర్వహణ సంస్థ పీీఠాధిపతికి ‘విశ్వధార్మిక చూడామణి’ బిరుదును వేణుగోపాల దీక్షితుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక చింతన, దేవతారాధనే నమ్ముకున్న వారికి అభయప్రదాతని పీీఠాధిపతి గాడ్‌ అన్నారు. పీీఠాథిపతి జననీజనకులు వాడ్రేవు చిన్న కృష్ణంరాజు, వెంకటరత్నం స్మత్యర్థం ఏటా అందించే ఆదర్శ దంపతుల పురస్కారాన్ని వైఖానస పండితుడు ప్రభాకరాచార్యులు, అంజనా దంపతులకు అందజేశారు. వేడుకల్లో సాహితీవేత్తలు డా.చిలకపాటి రాఘవాచార్యులు, ఎర్రాప్రగడ రామకృష్ణ, ధూళిపాల మహదేవమణి, మండపేట ఏఎంసీీ ఛైర్‌పర్సన్‌ తేతలి వనజారెడ్డి, డా.నవీన్‌రెడ్డి, ఎంపీీపీీ నౌడు వెంకటరమణ, సాహితివేత్తలు గొర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి, చంద్రశేఖర భరద్వాజ, విష్ణుప్రియ, పీీఠం పర్యవేక్షుకుడు బాపిరాజు, పీీఆర్వో బాబీ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని