logo

ఇసుకంతా తోడేస్తున్నా.. ఇంకెన్నాళ్లు నిద్ర నటిస్తారు?

గోదావరి నదీగర్భంలో యంత్రాలను దించి పర్యావరణానికి విఘాతం కలిగించే ఇసుక తవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా మనలను కాదులే అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు.

Published : 07 May 2024 04:52 IST

ఇసుక తవ్వకాలకు నదీగర్భంలో వేసిన రోడ్లు

సీతానగరం: గోదావరి నదీగర్భంలో యంత్రాలను దించి పర్యావరణానికి విఘాతం కలిగించే ఇసుక తవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా మనలను కాదులే అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు. తూర్పు, ఏలూరు జిల్లాలను సరిహద్దులుగా చెప్పుకుంటూ మునికూడలి గోదావరి నదిలో యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వి రేయింబవళ్లు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇసుక తవ్వకాలపై కన్నెత్తిచూసేందుకు కూడా భయపడుతోంది. నిత్యం వందలాది లారీల్లో ఇసుక ఇతర జిల్లాలకు తరలిస్తున్నా దారిలో ఎటువంటి తనిఖీలు చేయడం లేదు. తెదేపా హయాంలో ఈ ప్రాంతంలో వేల మంది కూలీలు ఇసుక తవ్వకాలతో ఉపాధి ఉండేదని వైకాపా నాయకులు అడ్డగోలు తవ్వకాలకు యంత్రాలను దించారని కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని గనులశాఖకు సమాచార హక్కుచట్టం ద్వారా విన్నవించినా ప్రయోజనం లేదు. మళ్లీ అధికారంలోకి వస్తుందో..రాదో తెలియదు దొరికిన కాడికి దోచుకోవాలనే రీతిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేసుకుంటూ పోతున్నారు వైకాపా నాయకులు. ఎన్డీయే అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకతోపాటు వేలమంది కూలీలకు చేతినిండా రేవుల్లో పని కల్పిస్తామనే హామీ ఇసుకాసురులకు మింగుడు పడడం లేదు. ఇక సమయం లేదంటూ ఎక్కడపడితే అక్కడ గోదావరి తీరంలో యంత్రాలను దించేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎగువన అడ్డు వేయడం, గోదావరిలో నీటిఎద్దడి వల్ల వేసిన మేటలు తవ్వుకునేందుకు ఇసుకాసురులకు వరంగా మారిందంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని