logo

పచ్చదనం.. కొత్తదనం..

పట్టణంలోని చినరావూరుకు చెందిన ‘సూర్యదేవర కృష్ణదేవ్‌’ పర్యావరణ ప్రేమికుడు. తన నివాస ఆవరణలో, డాబాపైన పచ్చని తోటలను ఆయన పెంచారు.

Published : 27 Nov 2022 05:49 IST

యూట్యూబ్‌ ఆలోచనలకు కొత్త ఆవిష్కరణలు
మిద్దె తోటలోకి విభిన్న కుండీలను తయారుచేసుకున్న తెనాలి వాసి


టర్కీ టవల్‌, సిమెంట్, రంగు కలిస్తే ఇలా విభిన్న ఆవిష్కరణ

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: పట్టణంలోని చినరావూరుకు చెందిన ‘సూర్యదేవర కృష్ణదేవ్‌’ పర్యావరణ ప్రేమికుడు. తన నివాస ఆవరణలో, డాబాపైన పచ్చని తోటలను ఆయన పెంచారు. తన ఆలోచనకు తగ్గట్టుగా కుండీలు బయటి మార్కెట్లో దొరకలేదు. దీంతో నచ్చిన విధంగా వాటిని పెంచడానికి ‘యూ ట్యూబ్‌’ ద్వారా పలు అంశాలను తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొబ్బరి చిప్పలు, వెదురు బొంగులు, తదితర సహాజ వస్తువులతో పాటు విభిన్న ఆకారాలతో వాటిని తయారు చేశారు.వాటితో పాటుగా సిమెంట్ కుండీలను కూడా ఆయన రూపొందించుకున్నారు. ఆలోచన, శ్రమ, సృజన జోడితో జరిగిన ఆవిష్కరణలు చూడగానే ఎవ్వరైనా భలే..ఉన్నాయేనని అనిపిస్తోంది. కొత్త తరహాలో కనువిందు చేస్తున్న కొన్ని కుండీలను చిత్రా ల్లో చూడవచ్చు.

సిమెంట్తో ఇంట్లోనే తయారైన విభిన్న కుండీ

తక్కువ స్థలంలో పచ్చదనం..

అందరికీ పచ్చదనంపై మక్కువ పెరిగిందని, తక్కువ స్థలం అందుబాటులో ఉన్నా చాలా మంది మంచి మొక్కలు పెంచుతున్నారని అలాంటి వారందరూ కొంత కొత్తదనంతో ఇలా కుండీలు తయారు చేసుకోవచ్చునని కృష్ణదేవ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని