logo

కోడ్‌ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!

ఈ చిత్రం చూశారా..  కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్‌లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్‌లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు.

Published : 29 Mar 2024 04:08 IST

అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వకాలు
ఈనాడు, బాపట్ల

ఈ చిత్రం చూశారా..  కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్‌లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్‌లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. ఇందుకు విరుద్ధంగా రాత్రివేళ భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్న తీరు ఈ చిత్రమే నిదర్శనం. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ తనిఖీలకు వస్తారని రెండు రోజుల పాటు తవ్వకాలు ఆపేశారు. తనిఖీలకు రాలేదని నిర్ధరించుకున్న అధికారపార్టీ నేతలు తవ్వకాలను మళ్లీ ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం కానీ, పోలీసు, రెవెన్యూ, సెబ్‌, నిఘా విభాగాలు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

మ్మడి గుంటూరు జిల్లాలో వైకాపా పాలనలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగాయి. అధికార పార్టీ నేతలు జిల్లా కలెక్టర్లను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ పెద్దల అండతో కృష్ణానదిని కొల్లగొట్టారు. జిల్లా ఉన్నతాధికారులే అడ్డుకట్ట వేయలేకపోవడంతో క్షేత్రస్థాయిలో పని చేసే యంత్రాంగం అటువైపు వెళ్లకుండా మిన్నకుండిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ రావడంతో అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చింది. ఇకనైనా అధికారులు స్వేచ్ఛగా పని చేసి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తారని అందరూ భావించారు. అందుకు భిన్నంగా కోడ్‌ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఉన్న కంపెనీ ఒకటి ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతోంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వివిధ అంశాలకు సంబంధించిన అధికారుల బృందాలు తిరుగుతున్నా వారికి ఇసుక అక్రమ రవాణా కనిపించలేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ అధికార పార్టీ నేతల ఆగడాలకు సహకారం అందిస్తూ అధికారులు ఇతోధిక సాయం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తున్నా.. మీడియాలో కథనాలు వస్తున్నా యంత్రాంగంలో చలనం లేకపోవడం ఇసుకాసురులు మరింత రెచ్చిపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని