icon icon icon
icon icon icon

Andhra news: ముగిసిన పరిశీలన.. గుంటూరు లోక్‌సభకు అత్యధిక నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల్లో శుక్రవారం పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది.

Published : 27 Apr 2024 19:06 IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో శుక్రవారం పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు రిటర్నింగ్‌ అధికారులు రెండ్రోజుల సమయం తీసుకున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్‌ అధికారులు ఆమోదం తెలిపారు. మొత్తం 183 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి 47, శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి అత్యల్పంగా 16 దాఖలయ్యాయి. 

175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 3,644 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటీలో 2,705 నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు పరిశీలన అనంతరం ఆమోదించారు. 939 నామినేషన్లు తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి 52 దాఖలైతే అత్యల్పంగా చోడవరం నియోజవర్గంలో 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏప్రిల్‌ 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img