icon icon icon
icon icon icon

LS Polls: ‘లోక్‌సభ’ బరిలో ఉజ్వల్‌ నికమ్‌.. భాజపా టికెట్‌ ఖరారు

ముంబయి నార్త్‌ సెంట్రల్‌ స్థానం నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ను భాజపా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించింది.

Published : 27 Apr 2024 19:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections)గానూ మరో అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది. మహారాష్ట్రలోని ముంబయి నార్త్‌ సెంట్రల్‌ స్థానంలో వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్‌ ఎంపీ పూనమ్‌ మహాజన్‌ (Poonam Mahajan)ను ఈసారి పక్కనపెట్టి.. ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ (Ujjwal Nikam) పేరును ప్రకటించింది. పూనమ్‌ తండ్రి ప్రమోద్‌ మహాజన్‌ హత్య కేసును ఆయనే వాదించారు. కాంగ్రెస్‌ (Congress) ఇప్పటికే ధారావీ ఎమ్మెల్యే వర్ష ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ను ఇక్కడినుంచి పోటీలో దించింది. అదేవిధంగా.. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితానూ భాజపా శనివారం విడుదల చేసింది.

హెలికాప్టర్‌లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ

1993 ముంబయి బాంబు పేలుళ్లు, టి-సిరీస్‌ మ్యూజిక్‌ సంస్థ అధినేత గుల్షన్‌ కుమార్‌ హత్య కేసు, 2008 ముంబయి దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అయిన ఉజ్వల్‌ నికమ్‌ అలుపెరగకుండా శ్రమించారు. 2013 ముంబయి గ్యాంగ్‌ రేప్‌ కేసు, 2016 కోపర్దీ సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. ఆయన విశేష సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. 2017లో ఉజ్వల్‌ నికమ్‌ బయోపిక్‌.. ‘ఆదేశ్‌- ది పవర్‌ ఆఫ్‌ లా’ అనే పేరుతో కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కింది. ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో భాగంగా మే 20న ముంబయి నార్త్‌ సెంట్రల్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img