logo

‘డిజిలాకర్‌’లో విద్యార్థుల డిగ్రీ పట్టాలు

విద్యార్థుల డిగ్రీ పట్టాలను డిజిటల్‌ రూపంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులకు పట్టాలు, సర్టిఫికెట్లను డిజిటల్‌ రూపంలో అందించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

Published : 21 May 2022 06:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థుల డిగ్రీ పట్టాలను డిజిటల్‌ రూపంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులకు పట్టాలు, సర్టిఫికెట్లను డిజిటల్‌ రూపంలో అందించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. దీనివల్ల నకిలీ ధ్రువపత్రాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుచిక్కుతుంది. ఇందుకోసం జాతీయ అకడమిక్‌ డిపాజిటరీ(ఎన్‌ఏడీ) ఆధ్వర్యంలో డిజిలాకర్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు హెచ్‌సీయూకు సంబంధించి.. మొదటి నుంచి 20వ స్నాతకోత్సవం వరకు ప్రదానం చేసిన 33,186 డిగ్రీ పట్టాలను డిజిలాకర్‌లో వర్సిటీ అధికారులు అప్‌లోడ్‌ చేశారు. డిజిలాకర్‌లో నమోదు చేసుకుని ఆయా ధ్రువీకరణపత్రాలు విద్యార్థులు ఎక్కడైనా పొందవచ్ఛు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని