logo

పరుగు.. ఆరోగ్యం మెరుగు

ఉరుకులు పరుగుల నగర జీవనంలో ఫిట్‌నెస్‌ను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పనులకు పరుగున వెళుతుంటారు కానీ ఆరోగ్యం కోసం రోజులో కొద్దిసేపు.. కుదరకపోతే వారాంతాల్లో పరుగెత్తమంటే బద్దకిస్తుంటారు పలువురు. ఆరోగ్యంగా ఉండేందుకు

Published : 03 Jul 2022 03:36 IST

ఆగస్టు మారథాన్‌ కోసం ప్రతివారం 5కె రన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఉరుకులు పరుగుల నగర జీవనంలో ఫిట్‌నెస్‌ను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పనులకు పరుగున వెళుతుంటారు కానీ ఆరోగ్యం కోసం రోజులో కొద్దిసేపు.. కుదరకపోతే వారాంతాల్లో పరుగెత్తమంటే బద్దకిస్తుంటారు పలువురు. ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్‌నెస్‌లో అత్యంత ప్రాధాన్యమైన అంశంగా పరుగును రూపొందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ రన్నర్స్‌ ఏడేళ్లుగా కృషి చేస్తోంది. మారథాన్‌కు ముందు 8 వారాలపాటు సీనియర్‌ రన్నర్‌ మార్గదర్శకంలో 5 కి.మీ. శిక్షణ పరుగులను నగరవ్యాప్తంగా నిర్వహిస్తోంది.
కొత్తవారి కోసం ప్రత్యేక శిక్షణ.. గతంలో ఎప్పుడు పరుగెత్తలేదా? ఇలాంటి వారి కోసమే ‘కౌచ్‌ టు 5కే’ని నిర్వహిస్తున్నారు. 5 కి.మీ. దూరాన్ని సులభంగా, శక్తికి తగ్గ వేగంతో పరుగెత్తగలిగేలా 8 వారాలపాటు అనుభవజ్ఞులైన రన్నర్లతో శిక్షణ ఇస్తారు. జులై 4వ తేదీన నగరంలోని 30 ప్రదేశాల్లో ఈ శిక్షణను ప్రారంభిస్తారు. ఆగస్ట్‌ 27, 28 తేదీల్లో జరిగే ఎన్‌ఎండీసీ మారథాన్‌-2022 వరకు ఇది కొనసాగుతుందని హైదరాబాద్‌ రన్నర్స్‌ సొసైటీ తెలిపింది. 2011 నుంచి హైదరాబాద్‌లో ఆగస్టు చివరి ఆదివారం మారథాన్‌ నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది 1250 మంది పాల్గొనగా.. కొవిడ్‌కు ముందు 2019లో 27 వేల మంది పాల్గొన్నారు.

శిక్షణ ఇచ్చే ప్రాంతాలు
* స్థానికులకే పరిమితం: ఐటీ కారిడార్‌ చుట్టూ 13 గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాంగణాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
* ఎవరైనా పాల్గొనే ప్రదేశాలు: కొండాపూర్‌లోని బొటానియల్‌ గార్డెన్‌, సైనిక్‌పురి బీవీబీ స్కూల్‌, హైటెక్‌సిటీ, మీర్‌పేట చెరువు, కేబీఆర్‌ పార్క్‌, బీహెచ్‌ఈఎల్‌ క్లబ్‌, కొంపల్లి, మన్సురాబాద్‌, ప్రగతినగర్‌ చెరువు, చెంగిచెర్ల, ఉప్పల్‌ శిల్పారామం, సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ మైదానం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని