logo

పది అడుగుల ఐస్‌పై బతుకమ్మ

హరిజాంటల్‌ ఫ్యూజింగ్‌ టెక్నిక్‌ విధానంలో 400 కిలోల ఐస్‌ బ్లాకులను వినియోగిస్తూ బేగంపేటలోని బ్రాండ్‌ సీఏఐ - కలినరీ అకాడమీ పీజీ విద్యార్థులు ఐస్‌ బతుకమ్మను రూపొందించారు. విద్యార్థులు తమ ప్రాక్టికల్‌ ఎక్స్‌టర్నల్‌ పరీక్షలో భాగంగా ఇచ్చిన

Published : 25 Sep 2022 03:47 IST

సోమాజిగూడ: హరిజాంటల్‌ ఫ్యూజింగ్‌ టెక్నిక్‌ విధానంలో 400 కిలోల ఐస్‌ బ్లాకులను వినియోగిస్తూ బేగంపేటలోని బ్రాండ్‌ సీఏఐ - కలినరీ అకాడమీ పీజీ విద్యార్థులు ఐస్‌ బతుకమ్మను రూపొందించారు. విద్యార్థులు తమ ప్రాక్టికల్‌ ఎక్స్‌టర్నల్‌ పరీక్షలో భాగంగా ఇచ్చిన టాస్క్‌ మేరకు రూపొందించిన బతుకమ్మ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐదుగురు పీజీ విద్యార్థులు 8 ఐస్‌ బాక్స్‌లతో 10 అడుగుల ఎత్తులో దీనిని సిద్ధం చేశారు. తయారీకోసం విద్యార్థులు ఆధునిక ఎలక్ట్రికల్‌ కార్వింగ్‌ యూరోపియన్‌ టూల్స్‌ను వినియోగించినట్లు తెలిపారు. శనివారం బేగంపేటలోని కలినరీ అకాడమీలో ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని