logo

గుప్తనిధుల తవ్వకాల కలకలం

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడంతో స్థానికంగా కలకల రేపింది. ఈ ఘటన సుల్తాన్‌పూర్‌ తండాలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై విఠల్‌రెడ్డి కథనం ప్రకారం..తండాకు చెందిన తుల్జ్యానాయక్‌ తనపొలంలో గుప్తనిధులు తీసేందుకు నగరంలోని

Published : 26 Sep 2022 02:40 IST

అర్ధరాత్రి పూజలు జరిపింది ఇక్కడే..

పరిగి గ్రామీణ: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడంతో స్థానికంగా కలకల రేపింది. ఈ ఘటన సుల్తాన్‌పూర్‌ తండాలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై విఠల్‌రెడ్డి కథనం ప్రకారం..తండాకు చెందిన తుల్జ్యానాయక్‌ తనపొలంలో గుప్తనిధులు తీసేందుకు నగరంలోని హైదర్‌గుడాకు చెందిన నర్సింహారెడ్డి, విద్యాసాగర్‌లను పిలిపించాడు. వీరితో పాటు తండాకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులను సహాయంగా తీసుకుని నిధుల కోసం తవ్వకాలు జరిపేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రాలు చదువుతూ గుంత తవ్వుతుండగా... పరిసర రైతులకు శబ్దాలు వినిపించడంతో దూరం నుంచి గమనించి తండా వాసులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోగా తండా వాసులు అక్కడికి చేరుకోవడంతో తుల్జ్యానాయక్‌ తోపాటు తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో పార, గంపలు, గొడ్డలి, పూలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పెండ పూజా సామగ్రి లభించాయి. దీంతో కోపోద్రిక్తులైన తండా వాసులకు (నగరానికి చెందిన) ఇద్దరు వ్యక్తులు చేతికి దొరకడంతో దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తవ్విన గుంతను పరిశీలించగా పూజా సామగ్రి తప్ప ఎలాంటి నిధులు లభించలేదు. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం నగర ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని