logo

ఉస్మానియాలో పెచ్చులూడిన పైకప్పు.. ఉద్యోగి తలకు గాయాలు

ఉస్మానియా ఆసుపత్రిలోని మైనర్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో పైకప్పు పెచ్చులూడింది. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న పేషెంట్‌ కేర్‌ ఉద్యోగి తలకు గాయాలయ్యాయి.

Updated : 05 Dec 2022 05:39 IST

కింద పడిన పైకప్పు

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఉస్మానియా ఆసుపత్రిలోని మైనర్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో పైకప్పు పెచ్చులూడింది. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న పేషెంట్‌ కేర్‌ ఉద్యోగి తలకు గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఉస్మానియా ఓపీ భవనంలోని మైనర్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో ఓ రోగికి వైద్యులు చికిత్స చేసి వెళ్లిపోయారు. తరువాత అక్కడి శస్త్రచికిత్స టేబుల్‌ను పేషెంట్‌ కేర్‌ ఉద్యోగి వినోద్‌కుమార్‌ శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఈ శిథిల భవనం పైకప్పు పెద్ద శబ్దంతో పెచ్చులూడింది. వినోద్‌కుమార్‌ తలపై పడడంతో గాయాలయ్యాయి. ఆయన తలపై కుట్లు వేసి చికిత్స చేసిన అనంతరం అవుట్‌ పేషెంట్‌గా ఇంటికి పంపించారు. ఇటీవల ఈ ఆపరేషన్‌ థియేటర్‌ను ఆధునికీకరించారు. ఈ భవనంలోని ఆర్‌ఎంవో కార్యాలయం, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, మీకో వార్డు తదితర విభాగాల్లోనూ గతంలో సీలింగ్‌ పెచ్చులూడిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని