logo

పేరుకే గొప్ప.. పేరుకుంటోంది చెత్త

జిల్లాలో వాణిజ్య, వ్యాపార కేంద్రంగా పేరొందిన తాండూరు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుంటున్నాయి.

Updated : 24 Mar 2023 04:59 IST

తాండూరులో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌

వర్షం పడితే రూపు మారే రోడ్డు

జిల్లాలో వాణిజ్య, వ్యాపార కేంద్రంగా పేరొందిన తాండూరు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుంటున్నాయి. తద్వారా దుర్వాసన వ్యాపిస్తూ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వర్షం వస్తే రహదారులన్నీ బురదమయంగా మారుతున్నాయి.

71వేల జనాభా: పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో లేక పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో మొత్తం 36 వార్డుల్లో 71,008 జనాభా ఉంది. అందులో 16 వేల దాకా నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. వాటిద్వారా ప్రతి రోజు 42 మెట్రిక్‌ టన్నుల తడి, పొడి చెత్త వెలువడుతుంది. గుర్తించిన 6 జోన్లలో 14 మురికి వాడలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

* చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించే వాహనాలు కార్యాలయం నుంచి కదలటం లేదు. ఇందుకు 8 ట్రాక్టర్లకు కేవలం 4 మాత్రమే నడుస్తున్నాయి. 18 ఆటోలకు గాను 12 ఆటోలు అసలే నడవటం లేదు.


చర్యలు చేపడతాం: నరేందర్‌ రెడ్డి, పురపాలక సంఘం మేనేజరు, తాండూరు

పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగు పర్చటానికి చర్యలు తీసుకుంటాం. పట్టణ వ్యాప్తంగా చెత్తను ఎప్పటికప్పుడు తొలగించటానికి చర్యలు తీసుకుంటాం. వార్డుల వారిగా చెత్త సేకరణకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించటానికి కృషి చేస్తాం. వీధుల్లో పరిశుభ్రత తొలగించటానికి ప్రజల సహకారాన్ని తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని