logo

‘సేవ్‌ లద్దాఖ్‌’కు సంఘీభావం

సేవ్‌ లద్దాఖ్‌ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది.

Published : 28 Mar 2024 03:22 IST

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: సేవ్‌ లద్దాఖ్‌ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. మంగళవారం రాత్రి క్యాంపస్‌లో సేవ్‌ లద్దాఖ్‌కు మద్దతు తెలుపుతూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. పరిశోధక విద్యార్థి డెస్కియాంగ్‌ ఆంగ్మో మాట్లాడుతూ..లద్దాఖ్‌ సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ సమతుల్యత, అక్కడి ప్రజల హక్కుల పరిరక్షణకు చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలన్నారు.   పరిశోధక విద్యార్థి సజ్జాద్‌, ముసాద్దిక్‌ హుస్సేన్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ధీరజ్‌ సంగోజి, లియాఖత్‌ అలీ, నాద్రన్‌, మాంగ్పి, పట్లోళ్ల శ్రీరామయాదవ్‌, అమల్‌, సునీల్‌, బాసిత్‌, ఆల్ఫిన్‌, ప్రణతి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని