logo

భాజపా చేసిందేమీ లేదు: దానం

భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విమర్శించారు.

Published : 20 Apr 2024 03:39 IST

రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ను సత్కరిస్తున్న సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌, చిత్రంలో మేయర్‌ విజయలక్ష్మి

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విమర్శించారు. ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ బూత్‌ స్థాయి సభ్యుల సమావేశం శుక్రవారం సోమాజిగూడలోని జయా గార్డెన్స్‌లో నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. తాను పార్లమెంటుకు ఎన్నికైనా ఎమ్మెల్యేగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటానని వివరించారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. గజమాలతో సత్కరించారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, కార్పొరేటర్లు వనం సంగీత, మహాలక్ష్మి తదితరులు మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో దానం నాగేందర్‌ను గెలిపించుకోవాలన్నారు. పార్టీ సీనియర్‌ నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని