logo

యువతకు అష్ఫాక్‌ ఆదర్శం

సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించిన అష్ఫాక్‌ నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి అన్నారు.

Published : 22 Apr 2024 03:25 IST

అష్ఫాక్‌, జాఫర్‌లను సన్మానిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించిన అష్ఫాక్‌ నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి అన్నారు. గొట్లపల్లికి చెందిన అష్ఫాక్‌   ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 770 ర్యాంక్‌ సాధించారు.ఈ నేపథ్యంలో అష్ఫక్‌తోపాటు అతని తండ్రి జాఫర్‌ను ఎమ్మెల్యే శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలోని మారుమూల గ్రామానికి చెందిన యువకుడు ఎంతో కష్టపడి సివిల్స్‌లో ర్యాంకు సాధించడం గొప్ప విషయం అన్నారు.ఆ యువకుడి స్ఫూర్తితో జిల్లా యువకులు మున్ముందు జరిగే పోటీ పరీక్షల్లో మరిన్ని ర్యాంకులు తెచ్చుకోవాలని కోరారు. పరీక్షల శిక్షణ విషయంలో నిరుద్యోగులు ముందుకొస్తే తనవంతు సహకారం అందిస్తానన్నారు.అంతకుముందు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామపెద్దలు తండ్రీ కొడుకులను సత్కరించారు. గొట్లపల్లి గ్రామానికి మంచిపేరు తెచ్చారంటూ కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని