logo

దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం

గోద్రెజ్‌ కన్జూమర్స్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ బ్రాండ్‌ గుడ్‌నైట్‌ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది.

Published : 25 Apr 2024 02:09 IST

నిద్రలేమికీ దోమలే ప్రధాన కారణం
గుడ్‌నైట్‌ సర్వే నివేదిక వెల్లడి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గోద్రెజ్‌ కన్జూమర్స్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ బ్రాండ్‌ గుడ్‌నైట్‌ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ‘ఒక దోమ - లెక్కలేనన్ని బెదిరింపులు’ అనే పేరుతో గుడ్‌నైట్‌ సంస్థ మార్గనిర్దేశనంతో పరిశోధన సంస్థ యుగవ్‌ దేశవ్యాప్తంగా సర్వే చేసి ఈ నివేదిక విడుదల చేసింది. నివేదిక ప్రకారం దోమల వల్ల సంక్రమించే వ్యాధుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థపై సుమారు రూ.16 వేల కోట్ల ఆర్థిక భారం పడుతోంది. దేశంలో ఏటా 40 మిలియన్లకుపైగా మలేరియా, డెంగీ వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రకు భంగం కలిగి తమ ఉత్పాదకతపై ప్రభావం పడుతోందని సర్వేలో పాల్గొన్న పురుషుల్లో 62 శాతం మంది, మహిళల్లో 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. నిద్రలేమికి దోమలు ప్రధాన కారణమనే వాదనతో సర్వేలో పాల్గొన్నవారిలో పశ్చిమ భారత్‌కు సంబంధించి 56 శాతం మంది, ఉత్తర భారత్‌కు సంబంధించి 52శాతం మంది, దక్షిణ భారత్‌కు సంబంధించి 47శాతం మంది, తూర్పు భారత్‌కు సంబంధించి 42శాతం మంది ఏకీభవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని