Published : 28 Nov 2021 02:59 IST
మూడు నెలల్లో 10 టన్నుల వర్మీ కంపోస్టు తయారీ
నగరపాలక కమిషనర్ యాదగిరిరావు
కార్పొరేషన్, న్యూస్‌టుడే: రానున్న మూడు నెలల్లో పది టన్నుల వర్మీ కంపోస్టు తయారు చేయాలని నగరపాలక కమిషనర్ యాదగిరిరావు ఆదేశించారు. శనివారం ఎస్ఆర్ఆర్, రిసోర్స్ సెంటర్లోని వర్మీ కంపోస్టు యార్డులు, ఎస్టీపీలోని రోడ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా పారిశుద్ధ్య పనులు, చెత్త వేరు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయాల్సిందేనని, తడి చెత్తతో యార్డులను నింపాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఈఈ రామన్, డీఈఈలు ఓంప్రకాశ్, వెంకటేశ్వర్లు, ఏఈ వాణి ఉన్నారు.
Tags :