logo
Published : 27/11/2021 01:11 IST

కన్నడ-సంస్కృతం నడుమ అవినాభావ సంబంధం

కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న

కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్‌ దేవనాథన్‌

హొసపేటె, న్యూస్‌టుడే: సంస్కృతం పలు భాషలకు తల్లి లాంటిది. కన్నడ-సంస్కృతం నడుమ అవినాభావ సంబంధాలు ఉన్నాయని కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ కె.ఇ.దేవనాథన్‌ పేర్కొన్నారు. సంస్కృత విశ్వవిద్యాలయం, హంపీ కన్నడ వర్సిటీలోని పురందరదాస అధ్యయన పీఠం, ద్రావిడ సంస్కృతి అధ్యయన పీఠాలు సంయుక్తంగా శుక్రవారం వర్సిటీలో ఏర్పాటు చేసిన ‘కన్నడ-సంస్కృత భాషా సాహిత్య సంబంధాలు’ అనే అంశంపై ప్రత్యేక సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కన్నడనాట గేయంలో చాలా సంస్కృత పదాలు ఉన్నాయి. కన్నడ, సంస్కృత భాషలు ఒక నాణేనికి రెండు ముఖాలని తేల్చి చెప్పారు. చిత్రదుర్గ తరళుబాళు జగద్గురు డాక్టర్‌ శివమూర్తి శివాచార్య స్వామీజీ మాట్లాడుతూ..ఆంగ్ల వ్యామోహంలో పడ్డ యువత కన్నడ భాషను పాతాళానికి తొక్కుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వర్సిటీ ఉప కుపలతి డాక్టర్‌ స.చి.రమేశ్‌ మాట్లాడుతూ కన్నడ భాష, సంస్కృతి, సంప్రదాయాలను సంరక్షించే దిశలో వర్సిటీ పలు కార్యక్రమాలను రూపొందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కులసచివుడు డాక్టర్‌ ఎ.సుబ్బణ్ణ రై, సంచాలకుడు డాక్టర్‌ మాధవ పెరాజె, డాక్టర్‌ సుచేత నవరత్న పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని