logo

ప్రధానికి రక్తంతో లేఖ

విజయపుర జిల్లా ముద్దేబిహాళ తాలూకా నాలతవాడ పట్టణంలో ప్రభుత్వ మాధ్యమిక విద్య కళాశాలను ప్రారంభించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైతో సహా పలువురు నాయకులకు నిరంజన్‌ జోషి రక్తంతో లేఖలు రాశారు. పట్టువదలని విక్రమార్కునిగా అతను రాసిన లేఖలకు ప్రభుత్వం

Published : 27 Sep 2022 01:07 IST

రక్తంతో రాసిన లేఖను ప్రదర్శిస్తున్న నిరంజన్‌ జోషి

విజయపుర, న్యూస్‌టుడే : విజయపుర జిల్లా ముద్దేబిహాళ తాలూకా నాలతవాడ పట్టణంలో ప్రభుత్వ మాధ్యమిక విద్య కళాశాలను ప్రారంభించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైతో సహా పలువురు నాయకులకు నిరంజన్‌ జోషి రక్తంతో లేఖలు రాశారు. పట్టువదలని విక్రమార్కునిగా అతను రాసిన లేఖలకు ప్రభుత్వం స్పందించింది. త్వరలో కళాశాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఐదేళ్లుగా ఎమ్మెల్యే, జిల్లాధికారి, విద్యాశాఖ అధికారులకు ఆయన లేఖలు రాశారు. ప్రధాని మోదీకి 2018లో లేఖ రాసిన తర్వాత ఆరు నెలల్లో కళాశాల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని బదులు వచ్చింది. అధికారులు ఆపై చర్యలు తీసుకోలేదు. కొవిడ్‌తో రెండేళ్లు మళ్లీ కళాశాలను ఏర్పాటు చేయలేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల ప్రారంభమైతే విద్యార్థులు డొనేషన్‌ చెల్లించే అవసరం ఉండదని నిరంజన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని