logo

నాలుక కోసుకున్న వ్యక్తి

కుటుంబ కలహాలతో విసుగు చెంది ఓ వ్యక్తి నాలుక కోసుకున్న సంఘటన తెక్కెలకోట పోలీసుఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

Published : 30 Jan 2023 02:25 IST

వీరేష్‌

సిరుగుప్ప, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో విసుగు చెంది ఓ వ్యక్తి నాలుక కోసుకున్న సంఘటన తెక్కెలకోట పోలీసుఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఉప్పారహొసళ్లి గ్రామానికి చెందిన వీరేష్‌ కుటుంబ కలహాలతో అసహనానికి గురై ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి సమీపంలో ఓ కొట్టులో రెండు బ్లేడ్లు తీసుకుని సమీపంలో కొండ వద్దకు వెళ్లి నాలుక కోసుకున్నాడు. ఇంటి నుంచి వెళ్లిన వీరేష్‌ ఎక్కడికి వెళ్లాడో అని భార్య కొండపైకి వెళ్లి చూడగా.. అతను కింద పడి ఉండటాన్ని గమనించి వెంటనే ప్లాస్టిక్‌ కవర్‌లో నాలుక వేసుకుని ఆమె కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. అనంతరం నాలుకతో పాటు వీరేష్‌ని బళ్లారి విమ్స్‌కి తరలించినట్లు సమాచారం. వీరేష్‌ బన్ని మహంకాళమ్మ దేవాలయానికి వెళ్లి దేవత ఆశీర్వాదం పొందేందుకు నాలుక కోసుకున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని గ్రామస్థులు తెలిపారు. తెక్కెలకోట పోలీసులను సంప్రదించగా ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని