logo

ఆప్‌లో చేరిన పూజా రమేశ్‌

మిస్‌ ఇండియా- 2021లో కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించిన నటి, సమాజ సేవకురాలు డాక్టర్‌ పూజా రమేశ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు.

Published : 04 Feb 2023 01:39 IST

పూజా రమేశ్‌కు పార్టీ పతాకాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : మిస్‌ ఇండియా- 2021లో కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించిన నటి, సమాజ సేవకురాలు డాక్టర్‌ పూజా రమేశ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. ఆప్‌ ప్రధాన కార్యాలయంలో పృథ్వీరెడ్డి, పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రు, కుశలస్వామి ఆమెకు పార్టీ పతాకాన్ని అందజేశారు. విధానసభ ఎన్నికలలో ఆమె రాయచూరు నుంచి పోటీ చేస్తారని పృథ్వీరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే స్థానికంగా ఆమె పేదల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. మహమ్మారి సమయంలో పారిశుద్ధ్య కార్మికులు, పేదలకు వరుస నెలలలో ఆమె మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి గౌరవ డాక్టరేట్తో పాటు వివిధ ప్రాంతాలలో మహిళా సాధకి, బసవ పురస్కారం, మదర్‌ థెరీసా పురస్కారం, భారత గౌరవ పురస్కారం, కావేరి రత్న, సన్‌షైన్‌ పురస్కారాలు అందుకున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని