logo

నటుడు చేతన్‌ నిర్బంధం

హిందుత్వం, ఉరిగౌడ, నంజేగౌడ- అంటూ తన ట్విటర్‌ ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలకు తెగించిన సినీ నటుడు చేతన్‌ను బెంగళూరు శేషాద్రిపురం ఠాణా పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు.

Published : 22 Mar 2023 02:49 IST

పోలీసుల వాహనంలో చేతన్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : హిందుత్వం, ఉరిగౌడ, నంజేగౌడ- అంటూ తన ట్విటర్‌ ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలకు తెగించిన సినీ నటుడు చేతన్‌ను బెంగళూరు శేషాద్రిపురం ఠాణా పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ఆయనను 32వ ఏసీఎంఎం న్యాయస్థానం ముందు హాజరు పరచగా.. 14 రోజుల న్యాయ నిర్బంధానికి పంపించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తన పోస్టు ద్వారా హిందువులను అవమానించే రీతిలో చేతన్‌ పోస్టు పెట్టారంటూ శివకుమార్‌ అనే వ్యక్తి సోమవారం రాత్రే ఠాణాలో ఫిర్యాదు చేశారు. ‘బాబరీ మసీదును కూల్చి వేసినప్పుడు దాన్ని రాముని జన్మభూమి అని ప్రచారం చేశారు. ఉరిగౌడ, నంజేగౌడ ఇద్దరూ టిప్పు సుల్తాన్‌ను హత్య చేశారంటూ ఇప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. హిందుత్వాన్ని సత్యంతోనే ఓడించవచ్చు. సత్యమే సమానత్వం’ అని తన పోస్టులో ఆయన రాసుకున్నారు. హిజాబ్‌ను సమర్థిస్తూ, హైకోర్టు న్యాయమూర్తి ఒకరిపై విమర్శలు గుప్పించిన చేతన్‌ను గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేసి కారాగారానికి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని