logo

అడ్డగోలుగా గర్భవిచ్ఛితి

పాండవపుర ఆరోగ్య శాఖ వసతి గృహాల సముదాయంలో లభించిన పిండాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Published : 08 May 2024 02:02 IST

మండ్య, న్యూస్‌టుడే : పాండవపుర ఆరోగ్య శాఖ వసతి గృహాల సముదాయంలో లభించిన పిండాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ మోహన్‌, తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్‌ అరవింద్‌ నేతృత్వంలోని అధికారులు దాడి చేసి డి-గ్రూపు ఉద్యోగిని అశ్విని, అంబులెన్సు డ్రైవరు ఆనంద్‌, మరో మహిళను అరెస్టు చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లోనే అబార్షన్లు చేస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అబార్షన్‌ చేయించుకునేందుకు వచ్చిన ఒక మహిళను మందలించి, ఆమె వివరాలు తీసుకుని అక్కడి నుంచి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని