logo

భారాస అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ.. ఎన్నికల ప్రచారం

ఉమ్మడి నల్గొండ , ఖమ్మం,  వరంగల్ జిల్లాల పరిధిలో పట్టభద్రుల భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుముల రాకేష్ రెడ్డి  విజయాన్ని కాంక్షిస్తూ... ఇల్లందులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 23 May 2024 11:14 IST

ఇల్లందు గ్రామీణం : ఉమ్మడి నల్గొండ , ఖమ్మం,  వరంగల్ జిల్లాల పరిధిలో పట్టభద్రుల భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుముల రాకేష్ రెడ్డి  విజయాన్ని కాంక్షిస్తూ... ఇల్లందులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారాస వ్యవస్థాపక సభ్యుడు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లందు కోరగుట్ట నేచర్ పార్క్, సింగరేణి పాఠశాల క్రీడా మైదానం ప్రాంతాల్లో  మార్నింగ్‌ వాకర్స్‌ను కలిసి మాట్లాడారు.  ప్రశ్నించే గొంతుకకు అవకాశమివ్వాలని,  నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరాడే  రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట నాయకులు రంగనాథ్, సిలివేరు సత్యనారాయణ, గిన్నారపు రాజేష్, చాంద్ భాషా, మునిగంటి శివ, ఆదూరి రవి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని