logo

ముత్తంగి రూపంలో రాములోరి దర్శనం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సోమవారం ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతుడైన రామయ్యతండ్రి చూడముచ్చటగా కనిపించి మురిపించాడు.

Published : 30 Apr 2024 04:39 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సోమవారం ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతుడైన రామయ్యతండ్రి చూడముచ్చటగా కనిపించి మురిపించాడు. అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన చేశారు. క్షేత్ర విశిష్టతను వైదిక పెద్దలు ప్రవచనం చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అర్చకులు కన్యాదానం చేసి ప్రవర పఠించారు. మాంగల్యధారణ,  తలంబ్రాల వేడుక ఘనంగా సాగాయి. దర్బారు సేవలో ఆలపించిన కీర్తనలు తన్మయత్వాన్ని చాటాయి. భక్తులు ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌తో పాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయుణ్ని, లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని