logo

లోక్‌సభ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

ఖమ్మం లోక్‌సభ స్థానంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో మిగిలిన 35 మంది అభ్యర్థులకు బ్యాలెట్‌ పత్రంలో వరుస క్రమం, ఎన్నికల గుర్తులను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌ కేటాయించారు.

Updated : 30 Apr 2024 06:17 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో మిగిలిన 35 మంది అభ్యర్థులకు బ్యాలెట్‌ పత్రంలో వరుస క్రమం, ఎన్నికల గుర్తులను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌ కేటాయించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులకు ముందుగా, రిజిస్టర్డ్‌(నమోదిత) పార్టీల అభ్యర్థులు ఏడుగురికి తర్వాత, చివరగా 24 మంది స్వతంత్ర అభ్యర్థులకు అక్షరమాల క్రమంలో వరుస క్రమం నిర్ణయించారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు, ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్‌ పత్రంలో వరుస క్రమం నిర్ణయించారు. స్వతంత్ర అభ్యర్థులు కోరుకున్న ఎన్నికల గుర్తులు కేటాయించారు.

  • జనసేన ఈ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయకున్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. తాజాగా స్వతంత్ర అభ్యర్థి వాసం రామకృష్ణ దొరకు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. ఈ గుర్తు అతనికి కలిసొచ్చే అవకాశం ఉంది.
  • భారాస ఎన్నికల గుర్తు కారును పోలిన రోడ్‌రోలర్‌, చపాతి రోలర్‌ గుర్తులను తొలగించాలని భారాస నాయకత్వం కొంతకాలంగా ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. కానీ ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఉల్లెంగల యాదరిగి రోడ్‌రోలర్‌, రిజిస్టర్డ్‌ పార్టీ అయిన అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ అభ్యర్థి కుక్కల నాగయ్యకు చపాతి రోలర్‌ గుర్తులను కేటాయించారు. ఈ ఇద్దరు అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు కొందరు ఓటర్లనైనా గందరగోళానికి గురిచేసే ప్రమాదం ఉందని భారాస శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని