logo

అతివల చేతిలో ఓటు చైతన్యం

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఓటరు చైతన్యంపై వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Updated : 06 May 2024 06:00 IST

ఖమ్మం బల్లేపల్లి, న్యూస్‌టుడే

రంగవల్లి తీర్చిదిద్దుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళలు

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఓటరు చైతన్యంపై వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వీప్‌(సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) కార్యక్రమంలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని గ్రామ సమాఖ్యల ద్వారా ఓటుహక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు వివిధ రకాల ప్రచారం చేస్తున్నారు. ‘నా ఓటు నా హక్కు - స్వీప్‌-2024’ అంటూ అక్షరాలను గోరింటాకుగా అలంకరించుకుని చైతన్యం నింపుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలంటూ ‘ఓట్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా, ఓట్‌ ఫర్‌ నాట్‌ సేల్‌’ అంటూ రంగవల్లుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో 1,018 గ్రామ సమాఖ్యలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 మండలాల్లో 981 గ్రామ సమాఖ్యలు ఓటరు చైతన్య అవగాహన సదస్సుల్లో పాల్గొన్నాయి.

‘నా ఓటు నా హక్కు’ అంటూ చేతుల్లో గోరింటాకు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని