logo

‘ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం’

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్‌రెడ్డి,  పూల రవీందర్‌ పిలుపునిచ్చారు.

Published : 06 May 2024 01:50 IST

ఖమ్మంలో మాట్లాడుతున్న బి.మోహన్‌రెడ్డి, చిత్రంలో పూల రవీందర్‌, తదితరులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్‌రెడ్డి,  పూల రవీందర్‌ పిలుపునిచ్చారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌  రెడ్డితో చర్చించామని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పెండింగులో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు, పెండింగ్‌ బిల్లులను జూన్‌ 30 లోగా విడుదల చేస్తామని చెప్పారని వివరించారు. ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టాలని, ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని, పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయాలని,    సర్వీసు పర్సన్లను నియమించాలని, ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగోన్నతులకు ఐదేళ్లు టెట్‌ నుంచి మినహాయించాలని   మోహన్‌రెడ్డి, రవీందర్‌ కోరారు. సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు  మోతుకూరి మధు, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని